హై జంప్ చేసిన దేశీ స్టాక్ మర్కెట్స్...!

Suma Kallamadi
నేడు స్టాక్ మర్కెట్స్ హై జంప్ చేసాయి. ప్రపంచ మార్కెట్లలో సానుకూలత నేపథ్యంలో అలాగే దేశ జిడిపి కి తోడుగా నిలుస్తామంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇచ్చిన భరోసా నేపథ్యంలో భారతీయ దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. రోజు మొదలైనప్పటి నుండి ఆద్యంతం లాభాల వైపు దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు మార్కెట్ సమయం ముగిసే సమయానికి సెన్సెస్ 629 పాయింట్లు బలపడి 38697 పాయింట్ల వద్ద ముగియగా, మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 170 పాయింట్లు బలపడి 11417 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇక నేడు ఇంట్రాడేలో నిఫ్టీ 50 లాభనష్టాల విషయానికి వస్తే.. ముందుగా అత్యధికంగా లాభాల పడిన షేర్ల విషయానికి వస్తే ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, టెక్ మహీంద్రా బ్యాంకులు అత్యధికంగా లాభం పడిన షేర్ల లలో ముందుగా ఉన్నాయి. ఇక ఇందులో ఇండస్స్ ఇండ్ బ్యాంక్ ఏకంగా 12 శాతం పైగా లాభపడింది. నేడు నిఫ్టీ బ్యాంక్ ఏకంగా 3.7 శాతం మేర లాభాల బాట పట్టింది. కేవలం నిఫ్టీ బ్యాంకు మాత్రమే కాకుండా మిగతా నిఫ్టీ ఇండెక్స్ లు అన్ని కూడా లాభాల వైపు నడిచాయి. అలాగే ఇక నష్టపోయిన షేర్ల విషయానికి వస్తే.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో, ఐటీసీ, రిలయన్స్, ntpc షేర్లు నష్టపోయిన లిస్టులో ముందుగా ఉన్నాయి. ఇక ఇందులో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ అత్యధికంగా 1.4 శాతం మేర నష్టపోయింది.

ఇక నగదు విభాగం విషయానికి వస్తే.. తాజాగా విదేశీ ఇన్వెస్టర్లు 712 కోట్ల విలువైన స్టాక్స్ ని విక్రయించగా దేశి ఫండ్స్ నుండి 400 కోట్ల రూపాయలకు పైగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇక నేడు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయల మేర తగ్గి 52,640 వద్ద ముగిసింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 48,250 వద్ద ట్రేడ్ అయింది. ఇక కేజీ బంగారం ధర 300 రూపాయల మేర తగ్గి 60,700 కు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: