లాభాల్లో ముగిసిన స్టాక్ మర్కెట్స్...!

Suma Kallamadi
మంగళవారం నాడు స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు కూడా తీవ్ర ఒడిదుడుకులను లోనై మార్కెట్ ముగిసే సమయానికి స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నేడు సెన్సెక్స్ 94 పాయింట్లు లాభపడి 38,067 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 25 పాయింట్లు బలపడి 11,247 పాయింట్లు వద్ద ముగిసింది. ఇక నేడు నిఫ్టీ ఆటో మినహాయించి మిగతా రంగాల అన్ని లాభాల్లోనే ముగిసాయి. ఇందులో నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఐటి, నిఫ్టీ ఫార్మా లాభాల్లో ముగిశాయి.

ఇక నేటి నిఫ్టీ 50 లాభనష్టాల విషయానికొస్తే.. అత్యధిక లాభాలు పొందిన కంపెనీల షేర్లు చూస్తే గ్రాసిమ్, టెక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, శ్రీ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ అత్యధికంగా లాభాల పొందిన లిస్టులో ముందుగా ఉన్నాయి. ఇందులో గ్రాసిమ్ కంపెనీ షేర్లు అత్యధికంగా 3.1 శాతం లాభపడ్డాయి.  ఇక మరోవైపు బిపిసిఎల్, భారతి, ఎయిర్టెల్, టాటా స్టీల్, జెఎస్డబ్ల్యు స్టీల్, హెచ్డిఎఫ్సి లైఫ్ కంపెనీ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్లలో ముందులో ఉన్నాయి. ఇక ఇందులో బిపిసిఎల్ కంపెనీ షేర్లు ఏకంగా 8 శాతం పైగా నష్టపోయాయి.

ఇక నేటి బంగారం ధరలు విషయానికొస్తే నేడు బంగారం వెండి ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయంగా మార్కెట్లో పసిడికి డిమాండ్ తగ్గిపోవడంతో నేడు దేశీయ మార్కెట్లోనూ ధరలు తగ్గాయి. నేడు ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం ధర 409 రూపాయలు తగ్గి 50272 రూపాయలకు చేరగా, మరోవైపు కిలో వెండి ఏకంగా 1700 రూపాయలు పతనమైంది. ఇక హైదరాబాద్ లో నేటి బంగారు ధరలు విషయం చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ 50,230 గా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ 48,340 గా ఉంది. అలాగే కేజీ వెండి ధర రూ 61,000 గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: