భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్...!

Suma Kallamadi
గత వారం చివరి రోజు మినహాయించి మిగతా నాలుగు రోజుల్లో భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు గత శుక్రవారం నాడు మళ్లీ తిరిగి లాభాల బాటపట్టింది. శుక్రవారం ముగింపుకి పొడిగింపుగా నేడు భారతదేశ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్, అలాగే నిఫ్టీ లు భారీ లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 593 పాయింట్లు బలపడి 37,982 వద్ద ముగిసింది అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా 177 పాయింట్లు లాభపడి 11,227 వద్ద ముగిసింది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ ఏకంగా 1428 పాయింట్లు లాభపడి పడింది. ఇంతలా సెన్సెక్స్ లాభపడడానికి గల కారణం ఓవైపు అమెరికా కాంగ్రెస్ కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించే విధంగా ప్రయత్నాలు చేస్తుండగా... మరోవైపు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలను సిద్ధం చేస్తున్న వస్తున్న వార్తలు దోహదం చేశాయి.

ఇక నిఫ్టీ 50 లో నేడు లాభనష్టాల విషయానికి వస్తే... ఇందూస్ ల్యాండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్ సంస్థ లకు సంబంధించిన కంపెనీల షేర్లు లాభపడ్డాయి. ఇందులో ముఖ్యంగా ఇందూస్ ల్యాండ్ బ్యాంక్ ఏకంగా 8 శాతం మేర లాభాల బాట పడ్డాయి. అలాగే ఇక నష్టాల విషయం చూస్తే హెచ్యూఎల్, విప్రో, ఇన్ఫోసిస్, నెస్లే కంపెనీలు అత్యధికంగా నష్టపోయిన షేర్లలో ముందుగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా హెచ్యూఎల్ 0.7 శాతం మేర అత్యధికంగా నష్టపోయింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి లో అన్ని రంగాలు కూడా లాభాల బాట పట్టాయి. ఫార్మా, ఎఫ్ఎంసిజి, మీడియా, బ్యాంకింగ్, ఆటోమొబైల్, మెటల్ ఇలా అన్ని రంగాలు లాభాల లోనే ముగిసాయి.

ఇలా నగదు విభాగం చూస్తే తాజాగా విదేశీ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్లు 2080 కోట్ల విలువైన స్టాక్స్ ను అమ్మగా, దేశీయ ఫండ్స్ దారులు రూ. 2071 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఇక భారతదేశంలో నేటి పసిడి, వెండి ధరల విషయం చూస్తే... హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 110 రూపాయలు నష్టపోయి 50,240 వద్ద ముగియగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 110 రూపాయలు నష్టపోయి 47,700 రూపాయల వద్ద ముగిసింది. ఇక అలాగే కేజీ బంగారం ధర 1000 రూపాయలు నష్టపోయి 58000 వేలకు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: