రోజుకు 400 రూపాయలు కడితే కోటి రూపాయలు.. అదిరిపోయే పోస్టాఫీస్ స్కీమ్...!

Reddy P Rajasekhar

ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని కలలు కంటారు. కానీ కొందరికీ ఆ కల సాధ్యమయితే మరికొందరికి మాత్రం సాధ్యం కాదు. ప్రస్తుత కాలంలో డబ్బును ఇన్వెస్ట్ చేయటానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. గోల్డ్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లు మొదలైన ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇలా డబ్బును ఇన్వెస్ట్ చేయటానికి ఉన్న ఆప్షన్స్ లో పోస్టాఫీస్ స్కీమ్స్ ఉత్తమమైనది. 
 
పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు పూర్తి రక్షణ ఉంటుంది. పోస్టాఫీస్ స్కీమ్స్ ఖచ్చితమైన రాబడిని అందిస్తాయి. 9 రకాల సేవింగ్ స్కీమ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇన్వెస్ట్ చేయగలిగే కాలం, అవసరాన్ని బట్టి నచ్చిన స్కీమ్ లో డబ్బులు పెట్టవచ్చు. స్కీమ్ ను బట్టి వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి. నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్, పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్ కమ్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్, సుకన్య సమృద్ధి అకౌంట్, కిసాన్ వికాస్ పత్ర అకౌంట్ స్కీమ్స్ పోస్టాఫీస్ లో అందుబాటులో ఉంటాయి. వీటిలో నచ్చిన స్కీమ్స్ లో డిపాజిట్ చేయవచ్చు. 
 
కోటి రూపాయలు సంపాదించాలని భావించే వారు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అకౌంట్ లో డిపాజిట్ చేయవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. అవసరమైతే మరో ఐదు సంవత్సరాలు మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకునే అవకాశం ఉంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో గరిష్టంగా లక్షన్నర వరకు సంవత్సరానికి డిపాజిట్ చేయవచ్చు. రోజుకు 400 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 23.5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 25 సంవత్సరాల తరువాత డబ్బులను తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే పూర్తి పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: