పతంజలి ఉత్పత్తి "ఆమ్లా జ్యూస్" భారత సైన్యం కాంటీన్ల నుండి తొలగింపు





అనుకోకుండా ఒక్క సారి సుడిగాలిలా దూసుకువచ్చిన పతంజలి ఉత్పత్తులపై సంశయం నెలకొంది. అదీ ఇండియన్ ఆర్మీ కాంటీన్ల నుండి ఒక ఆమ్లా జ్యూస్ వినియోగాన్ని నిలిపివేసింది. దీంతో ప‌తంజ‌లి ఆయుర్వేద కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బ త‌గి లింది. ఆ సంస్థ త‌యారు చేసే "ఆమ్లా జ్యూస్" ల్యాబ్ టెస్టులో ఫెయిలైంది.








దీంతో త‌మ‌ క్యాంటీన్స్ నుంచి ఆ ఉత్ప‌త్తిని తొల‌గించింది ఇండియ‌న్ ఆర్మీ అంతేకాదు కంపెనీకి కూడా షోకాజ్ నోటీస్ జారీ చేసిన‌ట్లు ర‌క్ష‌ణ శాఖ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ జ్యూస్‌ పై కోల్‌క‌తా లోని వెస్ట్ బెంగాల్ హెల్త్ లేబొరేట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిం చింది. టెస్ట్ ఫెయిలైన‌ వెంట‌నే ఈ ప్రోడ‌క్ట్ అమ్మ‌కాల‌ను నిలిపేసి, ఆ సంస్థ‌ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సంస్థ నుంచి వ‌చ్చే స‌మాధానాన్ని బ‌ట్టి త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.  


అయితే ఆమ్లా జ్యూస్ ఓ ఆయుర్వేదిక్ ఔష‌ధ‌మ‌ని, దానిపై ఆయుష్ మంత్రిత్వ‌ శాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప‌రీక్ష‌లు నిర్వ‌హిం చాల‌ని పతంజ‌లి సంస్థ వాదిస్తున్న‌ది. ఈ జ్యూస్‌కు "ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా"  నిబంధ‌న‌లు వ‌ర్తించ‌వ‌ని చెబుతున్న‌ది. దీనిపై రాందేవ్ బాబా కంపెనీ ఐన "పతంజలి ప్రొడక్ట్స్" "ఎఫ్ఎంసీజీ" ని ప్ర‌శ్నించ‌గా. ఉసిరి కాయ ర‌సం ఓ వైద్య ఉత్ప‌త్తి అని, దీనివ‌ల్ల ఎలాంటి హాని జ‌ర‌గ‌ద‌ని చెప్పింది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: