మరో మహానగరం నిర్మించనున్న కేసీఆర్‌?

Chakravarthi Kalyan
జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల పరిరక్షణకు ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో జారీ చేసిన జీవో 111ను కేసీఆర్‌ పూర్తిగా ఎత్తివేశారు. ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ ప్రాంతం దశ తిరగిపోతుంది. అక్కడ మహానగరం వెలవనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌కు ఆనుకొని మరో మహానగరం రాబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఖాళీ స్థలాలు తగ్గిపోయాయి. నగరం చుట్టుపక్కల అపార్టుమెంట్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.

జీవో 111 ఎత్తివేతతో వాణిజ్య, నివాస సముదాయాలు, పరిశ్రమలు, హోటళ్లు తదితర నిర్మాణాలకు భారీగా భూమి అందుబాటులోకి వచ్చేసింది. ఏడు మండలాల పరిధిలోని 84 గ్రామాలు 111 జీవో పరిధిలో ఇప్పటివరకు ఉన్నాయి. ఇవి జంట జలాశయాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందుకే  భారీ, శాశ్వత నిర్మాణాలకు అనుమతులు లేవు.  2022 ఏప్రిల్‌ 20న 111 జీవోను ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో ఎంఎస్‌ నంబరు 69 ఇచ్చింది. ఇప్పుడు కేబినెట్ కూడా ఓకే చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: