కిషన్‌ రెడ్డి సవాల్.. కేటీఆర్‌ స్వీకరిస్తారా?

Chakravarthi Kalyan
హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ టోల్‌ ను అతితక్కువ ధరకు ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం వెనుక ఓ పెద్ద కుంభకోణం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. ఓఆర్ఆర్ బంగారు బాతు లాంటిదనీ అలాంటి బంగారు బాతును కేసీఆర్ కుటుంబం చంపేస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ టెండర్ ప్రక్రియపై ఆడిట్ చేయిస్తారా..  లేక సీబీఐ దర్యాప్తునకు సిద్ధమా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.

హైదరాబాద్ చుట్టూ వేలాది కోట్ల రూపాయల భూముల కుంభకోణానికి పాల్పడుతున్నారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీజేపీఅధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామన్నారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదనీ.. బాధ్యులు ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ కుంభకోణంలో ఎవరెవరికి ఎంత వాటా ఉందో తేలాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr

సంబంధిత వార్తలు: