కేసీఆర్‌ జీతాలు పెంచాడు.. బండి సంజయ్‌ మండిపడ్డాడు?

Chakravarthi Kalyan
పారిశుద్ద్య కార్మికుల్లో అత్యధిక శాతం దళిత, గిరిజన, వెనకబడిన వర్గాలేనని అత్యంత పేదరికంలో ఉన్న వీరికి ప్రభుత్వం వెయ్యి రూపాయల వేతనం పెంచడం ఏ మాత్రం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. ఇది  కంటి తుడుపు చర్య మాత్రమేనని  బండి సంజయ్‌ తెలిపారు. గ్రామ పంచాయితీలు మున్సిపాలిటీలు నగర పాలక సంస్థల్లో పారిశుద్ద్య కార్మికుల పని వెలకట్టలేనిదని.. ఆరోగ్యాన్ని వయస్సును పట్టించుకోకుండా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అహర్నిశలు పనిచేస్తున్నారని  బండి సంజయ్‌ గుర్తు చేశారు.

కేసీఆర్ పాలనలో పారిశుధ్ద్య కార్మికులకు సక్రమంగా వేతనాలు చెల్లించడంలేదని...ఉద్యోగ భద్రత ఊసేలేదని  బండి సంజయ్‌ అన్నారు. కార్మికులకు అనారోగ్య సమస్య తలెత్తితే పట్టించుకునే యంత్రాంగం లేదని ఇలాంటి వారిపట్ల కేసీఆర్ ప్రభుత్వం శ్రద్ద చూపడంలేదని  బండి సంజయ్‌ దుయ్యబట్టారు. ఎన్నికలోస్తున్నాయనే వెయ్యి రూపాయలు పెంచి ప్రేమను ఒలకపోస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని  బండి సంజయ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు అదనంగా మరో రెండు వేల రూపాయల వేతనం పెంచుతామని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: