కేసీఆర్‌.. పొలిటికల్‌ విజయ్‌ మాల్యా?

Chakravarthi Kalyan
కేంద్రంపై విమర్శలు చేస్తున్న మంత్రి కేటీఆర్ అధికారం అన్ని రోజులు మీకే ఉండదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని బీజేపీ నేత, ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు.  ప్రజలు ఓట్లేస్తే హీరోలు.. లేదంటే జీరోలు అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. మీరు ఇప్పటికే అభద్రతా భావంలో ఉన్నారనేది అందరికీ తెలుసుని..  వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామో లేదో.. తమ ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని భయపడుతున్నారని బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు.

అందుకే రాత్రికి రాత్రి జీవోలు వస్తున్నాయని..  భూములు కూడా కబ్జా చేస్తున్నారని బూర నర్సయ్య గౌడ్ దుయ్యబట్టారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఔరంగాబాద్ సభకు భారీగా యాడ్స్ ఇచ్చారని బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. కేసీఆర్.. పొలిటికల్ విజయ్ మాల్యా లాగా తయారయ్యారనీ ఎద్దేవా చేశారు. రాయల తెలంగాణ అని ఒక ఏపీ నేత అంటున్నారనీ ఏపీలో ఓట్లు పొందాలని కేసీఆర్ చేస్తున్న మోసంలాగా అనిపిస్తోందని బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: