కవిత కొత్త పోరాటం.. వర్కవుట్ అవుతుందా?

Chakravarthi Kalyan
కేసీఆర్‌ కుమార్తె కవిత కొత్త పోరాటం ప్రారంభించారు. మహిళ రిజర్వేషన్ బిల్లు అంశాన్ని తన కార్యక్రమంగా మలచుకుంటున్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రాధాన్యాంశం కాకూడదని భారత జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నిస్తున్నారు.  మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉద్ధృతం చేసేలా దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టేలా ఆమె కార్యచరణ ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు.

దీని కోసం మిస్డ్ కాల్ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కవిత నిర్ణయించారు. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు కవిత నిర్వహించనున్నారు. మహిళా బిల్లుకు మద్దతివ్వాలని కోరుతూ దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డులు వ్రాయనున్నారు. మహిళా బిల్లు ఉద్యమాన్ని విస్తరించడంలో భాగంగా కవిత అనేక సామాజిక మాధ్యమాల్లో పోస్టర్ ను విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: