ఆంధ్రాలో లక్షన్నర ఎకరాల భూములు రెడీ?

Chakravarthi Kalyan
దేశ ఆర్ధిక ప్రగతిలో ఏపీ కీలక భూమిక పోషిస్తోందని ఆ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. దేశం నుంచి జరిగిన ఎగుమతుల్లో ఏపీ నుంచి 4.6 శాతం మేర ఉన్నాయన్న గుడివాడ అమర్‌నాథ్‌.. ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో ఏపీ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. ఏపీలో పరిశ్రమలకు కేటాయించేందుకు 49 వేల ఎకరాల భూమి సిద్ధంగా ఉందని.. దీనికి అదనంగా లక్ష ఎకరాల భూమి పరిశ్రమల కోసం కేటాయించామని.. దేశంలో ఎక్కడా లేనట్టుగా 3 పారిశ్రామిక కారిడార్ లు ఏపీలో ఉన్నాయని గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు.

ఈ కారిడార్ లలో 48 వేల ఎకరాల  భూమి కూడా పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉందని.. కోవిడ్ పరిస్థితులు దాటుకుని ఏపీ 11.46 శాతం వృద్ధి నమోదు చేస్తోందన్నారు. కియా, బ్రాండిక్స్, ఆపాచే లాంటి విదేశీ సంస్థలు ఏపీలో పని చేస్తున్నాయని గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. శ్రీసిటీలో 28 దేశాలకు చెందిన వేర్వేరు కంపెనీలు పారిశ్రామిక ఉత్పత్తిలో ఉన్నాయని... వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1.9 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చిందని గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: