కాళేశ్వరం అదుర్స్.. కేటీఆర్‌కు మరో గౌరవం?

Chakravarthi Kalyan
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. ప్రపంచ పర్యావరణ నీటి వనరులు సదస్సుకు హాజరు కావాలని ఆమెరికన్ సొసైటి ఆప్‌ సివిల్ ఇంజనీర్స్-ఎన్వైర్మెంటల్ అండ్ వాటర్ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్... తెలంగాణ మంత్రి కేటిఆర్‌ను ఆహ్వానించింది. ఇటీవల సంస్థకు సంబంధించి పలు బృందాలు కాళేశ్వరంను సందర్శించాయి. కాళేశ్వరం నిర్మించిన విధానం, సౌకర్యాలు, వేగంగా నిర్మాణం ఆ బృందాన్ని ఆకట్టుకున్నాయి. దీంతో ఆ సంస్థ ఎండి బ్రెయిన్‌ పార్సన్స్‌ కేటిఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు మే 21 నుంచి 25 వరకూ అమెరికలోని హెండర్‌సన్‌ నేవడాలో జరగనున్న సదస్సులో ప్రసంగించవలసిందిగా ఆయన తెలంగాణ మంత్రి కేటిఆర్‌ను కోరారు. 2017 మే లో క్యాలిఫోర్నియాలొ జరిగిన కార్యక్రమంలోనూ గతంలో మంత్రి కేటిఆర్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో తెలంగాణ చేపట్టిన పలు కార్యక్రమాల గురించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KTR

సంబంధిత వార్తలు: