ఇవాళ్టి నుంచి దక్కన్‌ స్పోర్ట్ భవనం కూల్చివేత?

Chakravarthi Kalyan
సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం జరిగిన దక్కన్ స్పోర్ట్స్ భవనాన్ని ఇవాల్టి నుంచి కూల్చివేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. సుమారు 41 లక్షల రూపాయల ఖర్చుతో కూల్చివేత ప్రక్రియ జరుగుతుందని మంత్రి తలసాని తెలిపారు. దీనికి టెండర్లు ఖరారయ్యాయని మంత్రి తలసాని తెలిపారు. దెబ్బతిన్న చుట్టు పక్కల నిర్మాణాలను చక్కదిద్దుతామన్న మంత్రి తలసాని.. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలు, అగ్నిమాపక జాగ్రత్తలు లేని భవనాలకు సంబంధించిన అంశాలపై మంత్రి కేటీఆర్ నేతృత్వంలో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

ఇలాంటి భవనాలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు. వెంటనే కూల్చివేతలు చేపట్టలేమని.. భవనాల్లో ఉంటున్న వారికి అవగాహన కల్పిస్తామన్న మంత్రి తలసాని.. అగ్నిమాపక పరికరాలు కొనుగోలు చేసేలా.. సెల్లార్, గోదాముల వినియోగంపై చైతన్యం కలిగిస్తామన్నారు. చిన్న అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేసే ఆలోచన ఉందన్న మంత్రి తలసాని..  కేసీఆర్ పుట్టినరోజున సచివాలయం ప్రారంభిస్తే తప్పేంటన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: