తెలంగాణ పోలీస్‌ జాబ్స్ .. ఈ నియమం మరవొద్దు?

Chakravarthi Kalyan
పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న గర్బిణీలు ఈ నెల 31వ తేదీలోపు హామీపత్రం సమర్పించాలని పోలీస్ నియామక మండలి తెలిపింది. తుది ఫలితాల్లో అర్హత సాధించి పోలీస్ ఉద్యోగానికి ఎంపికయ్యే గర్భిణీలు వైద్యులతో మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావాలని నియామక మండలి చెబుతోంది. తుది ఫలితాలో వెల్లడైన తేదీ నుంచి నెల రోజుల్లోపు దేహ దారుడ్య పరీక్షల్లో పాల్గొంటామని హామీ పత్రం ఇవ్వాలని నియామక మండలి అధికారులు తెలిపారు.

ఇటీవల కొందరు గర్భిణీలు దేహదారుడ్య పరీక్షలపై హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు గర్బిణీలకు పోలీసు నియామక మండలి అధికారులు కొన్ని సౌలభ్యాలు కల్పించారు. ప్రస్తుతం గర్బిణీగా లేదా బాలింతగా ఉంటూ దేహదారుడ్య పరీక్షలో అర్హత సాధించడం కష్టం, కాబట్టి ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన గర్బిణీలు లేదా బాలింతలు నేరుగా తుది రాత పరీక్షలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు నియామక మండలి తెలిపారు. మిగతా అభ్యర్థులందరూ ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన తర్వాత దేహదారుడ్య పరీక్షల్లో అర్హత సాధిస్తేనే వాళ్లకు తుది రాత పరీక్షలో అవకాశం కల్పిస్తున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: