విద్యార్థులకు గమనిక: ఆ వర్శిటీలో ఇంపార్టెంట్‌ కౌన్సెలింగ్‌?

Chakravarthi Kalyan
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం కోసం కౌన్సెలింగ్ ప్రారంభించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని వాటర్ టెక్నాలజీ సెంటర్‌లో ఈ కౌన్సెలింగ్ జరుగుతోంది. ఈ ప్రక్రియను వ్యవసాయ విశ్వవిద్యాలయం పీజీ స్టడీస్ డీన్ డాక్టర్ అనిత లాంఛనంగా ప్రారంభించారు.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ విద్యార్థులకు అందిస్తోన్న విద్యా బోధన, పరిశోధన, విస్తరణ వంటి మౌలిక సదుపాయాలు, ఇతర అంశాల గురించి ఆమె వివరించారు. కౌన్సెలింగ్‌లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విజేతలైన విద్యార్థులకు  పీజీ స్టడీస్ డీన్ డాక్టర్ అనిత ధృవీకరణ పత్రాలు అందించారు. డాక్టర్ అనిత విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రవణ్ కుమార్ పర్యవేక్షణలో ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా  జరుగుతోందని పీజీ స్టడీస్ డీన్ డాక్టర్ అనిత అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: