కేసీఆర్‌.. దిల్లీ సంగతి తర్వాత.. గల్లీలోనూ కష్టమేనట?

Chakravarthi Kalyan
తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దిల్లీలోనే కాదు...గల్లీలో కూడా ఉండకుండా చేస్తారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతం ఇవ్వలేని కేసీఆర్ దేశాన్ని పాలిస్తానంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ మాటలు అంత సీరియస్‌ గా తీసుకోవాల్సిన అవసరంలేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  అన్నారు.

ఖమ్మం సభలో ఏమి మాట్లాడాలో అర్థంకాక సమయం అయిపోయిందని హెలీకాప్టర్‌లో పెద్ద సమస్య అంటూ ప్రసంగం మధ్యలో అనడం ప్రజల దృష్టి మళ్లించడమే తప్ప మరోకటికాదని ఆమె దుయ్యబట్టారు. ఉచిత విద్యుత్ తెలంగాణాకే దిక్కులేదు దేశమంతా ఇస్తాడట అంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  దుయ్యబట్టారు. బీజేపీ నాయకులు రాష్ట్రానికి వచ్చి ప్రసంగిస్తే కేంద్రం నుంచి వచ్చి హిందీలో లోడ లోడ మాట్లాడుతారని విమర్శించిన కేసీఆర్‌...నిన్న  వచ్చిన నాయకులు ఏ భాషలో మాట్లాడారో సీఎం చెప్పాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: