ఆ వర్శిటీలో రూ6.5 కోట్ల ఫీజు రాయితీలు?

Chakravarthi Kalyan
అనురాగ్ యూనివర్సిటీ.. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల ఫీజుల్లో రాయితీ కోసం పరీక్షల షెడ్యూలు ప్రకటించింది. నిన్నటి నుంచి అనురాగ్ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు. అనురాగ్ సెట్‌లో భాగంగా ఈనెల 29న తొలి పరీక్ష నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ సీఈవో ఎస్.నీలిమ వెల్లడించారు. అనురాగ్‌ సెట్‌లో ప్రతిభ ఆధారంగా ఆరున్నర కోట్ల రూపాయల ఫీజు రాయితీలు ఇవ్వనున్నట్లు ఆమె ప్రకటించారు. అనురాగ్ యూనివర్సిటీలో  ఇంజినీరింగ్ కు నాలుగేళ్లకు కలిసి పది లక్షల రూపాయల ఫీజులో..  పది మందికి పూర్తి రాయితీ, 11 నుంచి 25 ర్యాంకుల వరకు యాభై శాతం, 26 నుంచి 100 ర్యాంకుల వరకు 25 శాతం ఫీజు తగ్గిస్తామన్నారు.

అనురాగ్ యూనివర్సిటీ సెట్‌ ద్వారా ప్రవేశాలు పొందిన మొదటి యాభై మందికి ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్నట్లు నీలిమ తెలిపారు. జేఈఈలో 75వేల వరకు, ఎంసెట్‌లో పది వేల ర్యాంకు సాధించిన విద్యార్థులకు కూడా ఫీజు రాయితీలు ఉంటాయని ఆమె అన్నారు. అనురాగ్ యూనివర్సిటీలో కోర్సులు పూర్తి చేసిన వారందరికీ ప్రముఖ సంస్థల్లో  ఉద్యోగాలు లభిస్తున్నాయని వీసీ రామచంద్రం కూడా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: