ట్రావెల్స్ సంక్రాంతి దోపిడీపై రవాణా శాఖ వార్నింగ్‌?

Chakravarthi Kalyan
పడుగ సీజన్ లో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని సహించబోమని ఏపీ రవాణాశాఖ కమిషనర్ పి.ఎస్.ఆర్ ఆంజనేయులు అంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆంజనేయులు ఆదేశించారు. పండుగ ముగిసే వరకు దాడులు చేయాలని నిర్ణయించారు. సరిహద్దు ల్లోని చెక్ పోస్టు వద్ద తనిఖీల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తారు. ఫిట్ నెస్ లేకుండా సరైన దృవపత్రాలు లేకుండా బస్సులు నడిపితే సీజ్ చేస్తారు. కండిషన్ లేని బస్సులు నడిపితే బస్సును సీజ్ చేస్తారు.

ప్రయాణికుల కు ఇబ్బంది లేకుండా బస్సు గమ్యస్థానం చేరాక బస్సులు సీజ్ చేయాలని నిర్ణయించారు. ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణమార్గాలు ఎంచుకుని ప్రయాణం చేయాలని విజ్ణప్తి చేస్తున్నామని ఆంజనేయులు తెలిపారు. ఇంటర్నెట్ లో ప్రైవేట్ ట్రావెల్స్ వసూలు చేసే చార్జీల వివరాలు తీసుకుని ఆధారాలు తీసుకుని కేసులు రాయాలని నిర్ణయించారు. ప్రయాణికులు రవాణా శాఖ అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: