కరోనా గేట్లు ఎత్తేసిన చైనా.. ప్రపంచానికి షాక్‌?

Chakravarthi Kalyan

చైనా మరోసారి ప్రపంచానికి షాక్ ఇచ్చింది. మూడేళ్ల తర్వాత కొవిడ్ ఆంక్షల్ని పూర్తిగా చైనా పూర్తిగా ఎత్తివేసింది. దీని ప్రకారం విదేశీ ప్రయాణికులకు ఎటువంటి క్వారంటైన్ ఉండదని చైనా వెల్లడించింది. ఇప్పటికే జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తివేసిన చైనా.. ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఆంక్షలు ఎత్తివేసి ప్రపంచాన్ని వణికిస్తోంది. కొవిడ్ కారణంగా చైనా గత మూడేళ్లుగా అంతర్జాతీయ ప్రయాణికులపై కఠిన ఆంక్షలు విధించింది. కానీ ఇప్పుడు చైనా  పూర్తిగా గేట్లు ఎత్తేసింది.

ఓవైపు తన దేశంలో కరోనా విలయం సృష్టిస్తున్నా చైనా జీరో కొవిడ్ విధానానికి చరమగీతం  పాడింది. అంతర్జాతీయ ప్రయాణికులకు కఠిన నిబంధనలు లేకుండానే చైనా అనుమతిస్తోంది. ఆంక్షల్ని సడలించడంతో చైనా విమానాశ్రయాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. మూడేళ్ల తర్వాత తొలిసారి అంతర్జాతీయ ప్రయాణికులు క్వారంటైన్‌ వంటి ఆంక్షలేమీ లేకుండా చైనాలో అడుగు పెట్టారు. మరోవైపు హాంకాంగ్‌తోనూ చైనాకు రాకపోకలు మొదలయ్యాయి. అంతే కాదు.. చైనాకు చెందిన ఇతర సరిహద్దు దేశాలతోనూ ప్రయాణాలు స్టార్ట్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: