రూ.500 కోట్లు కావాలి.. మందకృష్ణ మాదిగ డిమాండ్?

Chakravarthi Kalyan
వికలాంగుల సంక్షేమశాఖకు వచ్చే తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల్లో రూ. 500కోట్లు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేస్తున్నారు. వికలాంగులకు ఇస్తున్న మూడు వేల రూపాయల పింఛన్‌ను రెట్టింపు చేయాలని మంద కృష్ణ మాదిగ న్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా మందకృష్ణ మాదిగ లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
తొమ్మిది అడుగుల లూయిస్ బ్రెయిలీ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు తెలిపిన మంద కృష్ణ మాదిగ.. విగ్రహావిష్కరణకు సీఎం కేసీఆర్ వస్తే బాగుండేదని అన్నారు. వచ్చే జయంతి కార్యక్రమానికైనా సీఎం రావాలని మంద కృష్ణ మాదిగ  అన్నారు. దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ద్వారానే ఆయన పేరు మీద పార్కులు,విగ్రహాలను సాధించడం జరిగిందని మంద కృష్ణ మాదిగ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలో వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని మంద కృష్ణ మాదిగ  తెలిపారు. వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: