పీసీసీ పీఠం నుంచి దిగిపోతా.. రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు?

Chakravarthi Kalyan
కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందంటే.. తాను పీసీసీ పీఠం నుంచి దిగిపోయేందుకు సిద్ధమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్‌లో సీనియర్లు, జూనియర్లనే విబేధాలు మరిచి అంతా పార్టీని అధికారంలోకి తీసుకువద్దామని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. సికింద్రాబాద్ బోయినిపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతుల్లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాహుల్‌ గాంధీ సందేశాన్ని ప్రతి గడపకు చేరవేసి పార్టీ పటిష్టం చేసేందుకే హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, భారాస ప్రభుత్వాల తీరుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిగా అవకాశం వచ్చినా సోనియాగాంధీ పదవి స్వీకరించలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎముకలు కొరికే చలిలో సైతం రాహుల్ జోడో యాత్ర చేస్తున్నారన్న రేవంత్ రెడ్డి దేశంలో విచ్చిన్నకర శక్తులకు భయపడకుండా ప్రాణాలకు తెగించి యాత్ర కొనసాగిస్తున్నారని అన్నారు.

జనవరి 26న యాత్ర ముగింపుతో భాద్యత తీరలేదని.. హాత్‌ సే హాత్ జోడో అభియాన్‌ కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టినట్లు  రేవంత్ రెడ్డి  వివరించారు. ధరణితో లక్షలాది మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రేవంత్ రెడ్డి  ఆందోళన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: