జగన్ పింఛన్‌.. ఇచ్చేది తక్కువ..ప్రచారం ఎక్కువా?

Chakravarthi Kalyan
పింఛనులో లబ్ది తక్కువ ప్రభుత్వ ప్రకటనలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అవ్వా తాతల పెన్షన్లలోనూ అబద్దపు ప్రచారం చేస్తున్నారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. వృద్ధులకు 3వేల పెన్షన్ పేరుతో జగన్ రెడ్డి నయవంచన చేశారన్న అచ్చెన్నాయుడు.. 43 నెలల్లో ఒక్కో వృద్దుడికి 45వేలు ఎగనామం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గతంలో 200 ఉన్న పెన్షన్ ను 2వేలకు పెంచారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. పెన్షన్ల సంఖ్యపైనా జగన్ రెడ్డి మార్క్ తప్పుడు ప్రచారం జరుగుతోందని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

2014లో 39 లక్షల పెన్షన్లుంటే.. 2019కి 54.25 లక్షలకు పెంచారన్న... కానీ జగన్ రెడ్డి నాలుగేళ్లలో పెంచింది 10లక్షలే అని చెప్పారు. 2014లో పెన్షన్ల బడ్జెట్ 400 కోట్లు అయితే.. 2019 బడ్జెట్ 1384 కోట్లకు పెంచామని... ప్రస్తుత పెన్షన్ బడ్జెట్ 1765 కోట్లేనని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీపైనా తప్పుడు లెక్కలే చెబుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: