మా నిధులు లాగేసుకుంటారా.. కేసీఆర్‌..?

Chakravarthi Kalyan
ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఇందిరా పార్కు ధర్నా చౌక వద్ద సర్పంచుల ధర్నా నిర్వహించనున్నారు. పంచాయితీలకు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తారు. ఈ మేరకు ఇప్పటికే పోలీసుల అనుమతి కోరుతూ కాంగ్రెస్ పార్టీ పక్షాన లేఖ ఇచ్చారు. కాంగ్రెస్ పక్షాన తాము ధర్నా చౌక్ వద్ద ధర్నాకు అనుమతి కోరామని.. అసెంబ్లీ ముట్టడికో, రాస్తారోకో కోసమో అనుమతి అడగలేదని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

ధర్నా చౌక్ వద్ద అనుమతి ఇవ్వకపోయినా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్పంచుల ధర్నా జరిగి తీరుతుందన్న నేతలు.. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు ఇచ్చారు. సర్పంచుల ధర్నాను పోలీసులు అడ్డుకుంటే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతామని.. ధర్నా చౌక్ ఏర్పాటు చేసిందే ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు అక్కడ కూడా అనుమతులు ఇవ్వకపోవడంలో అర్థం లేదని కాంగ్రెస్ నేతలు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: