ఇది రైతు ఆత్మహత్యల తెలంగాణ.. ఇవిగో లెక్కలు?

Chakravarthi Kalyan
రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని ఎన్సీఆర్బీ లెక్కలు చెబుతున్నాయంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎన్సీఆర్సీ నివేదిక ప్రకారం 2014 నుంచి 2021 వరకు రాష్ట్రంలో 6,557 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాదిలో నవంబరు వరకు 11 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 512 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేల్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివరించారు.
2014 నుంచి ఈ నవంబర్ తొమ్మిదేళ్లలో 7,069 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... రైతు ఆత్మహత్యల్లో ఎక్కువ కౌలు రైతులవే ఉంటున్నాయన్నారు.  రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులున్నారని.. ఆత్మహత్యకు పాల్పడుతున్న రైతుల్లో 80 శాతం మంది కౌలు రైతులేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తూతూ మంత్రపు చర్యలు కాకుండా శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలన్న రేవంత్ రెడ్డి  ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: