ఓ మతంపై స్వరూపానందేంద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు?

Chakravarthi Kalyan
విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజనులంతా ఆంజనేయుని వారసులన్న స్వరూపానందేంద్ర స్వామి వారు అన్య మతాలను ఆశ్రయించ వద్దని సూచించారు. కొన్ని మతాలు గిరిజనులను ఆశ చూపి తమ మతంలోకి మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నాయని స్వరూపానందేంద్ర స్వామి విమర్శించారు. ఆంధ్ర - ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో విశాఖ శారదాపీఠం సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని గిరిజనులకు రగ్గులు, భగవద్గీత పంపిణీ చేశారు.
గిరిజన ప్రాంతాలే లక్ష్యంగా ఓ విదేశీ మతం మతమార్పిడులను ప్రోత్సహిస్తోందని స్వరూపానందేంద్ర స్వామి  విమర్శించారు. మత మార్పిడులను అడ్డుకోవడానికే భగవద్గీతలు పంచుతున్నామని స్వరూపానందేంద్ర అన్నారు. ఏపీలో గిరిజన ప్రాంతాలు ప్రత్యేక జిల్లాలుగా మారాయని.. గిరిజనులకు ఇది అదృష్టమేనని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. గిరిజన జిల్లాలు ఏపీలో మాత్రమే ఏర్పాటయ్యాయని.. అలాగే గిరిజన జిల్లాల్లో తక్షణం జిల్లా కోర్టులు పెట్టాలని స్వరూపానందేంద్ర కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: