సజ్జనార్‌ సార్.. తెలంగాణ ఆర్టీసీ పాట అదిరిందిగా..?

Chakravarthi Kalyan
హైదరాబాద్ మహాత్మగాంధీ బస్ స్టేషన్‌లోఆర్టీసీపై రాము మిరియాల రాసి పాడిన తెలంగాణ ఆన్ ట్రాక్ పాటను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో కలిసి బాజిరెడ్డి గోవర్థన్ ఆవిష్కరించారు. ఆర్టీసీకి ప్రస్తుతం రోజుకు 14నుంచి 15కోట్ల ఆదాయం వస్తుందని బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. పండుగ సమయాల్లో 21కోట్ల ఆదాయం వస్తుందని ఛైర్మన్ పేర్కొన్నారు. తార్నాక ఆసుపత్రికి కార్పోరేట్ ఆసుపత్రిని మించి చేస్తామన్నారు. ఆర్టీసీపై పాటను రూపొందించడానికి రెండు నెలలు బాగా కష్టపడినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రైవేటు రవాణా వ్యవస్థ పెరిగిన ఆర్టీసీని ఆదరిస్తున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సు గురించి ప్రజలకు తెలియ చెప్పడమే ఈ పాట ఉద్దేశ్యమని ఎండీ వివరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 24న 50కొత్త బస్సులను ప్రారంభిస్తారని ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్ వెల్లడించారు. మిగిలిన 250బస్సులను త్వరలోనే వస్తాయని తెలిపారు.రాష్ట్రంలో గతంలో 97బస్సు డిపోలు ఉంటే అన్ని నష్టాల్లో ఉండేవని...ప్రస్తుతం 40నుంచి 50వరకు బస్సు డిపోలు లాభాల్లోకి వచ్చాయని బాజిరెడ్డి గోవర్థన్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: