రేవంత్‌ రెడ్డీ.. నా పదవుల లిస్టు చూసుకో?

Chakravarthi Kalyan
రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నుంచి నిరసన సెగ తగిలింది. కొండా సురేఖ ఆయనకు బిగ్ షాక్‌ ఇచ్చారు. తెలంగాణ ప్రదేశ్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తనకు చోటు దక్కకపోవడంతో ఆమె రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తన బ్యాక్ గ్రౌండ్, హిస్టరీ చూసుకోవాలని రేవంత్‌ కు ఆమె సలహా ఇచ్చారు. తాను 1995 నుండి కాంగ్రెస్ పార్టీలో ఒక ఎం.పి.పి.గా, ఎం.ఎల్.ఎ.గా నాలుగుసార్లు, ఒకసారి మంత్రిగా, నా భర్త రెండుసార్లు ఎం.ఎల్.సి.గా లోకల్ బాడీ నుండి ఎన్నికయ్యానని గుర్తు చేశారు. తన  భర్త 1988 నుండే రాజకీయాల్లో ఉన్నారని... గత 34 సంవత్సరాలుగా మా కుటుంబము రాజకీయాల్లో ఉంటూ ప్రజల కోసము పనిచేస్తూ కొండా దంపతులుగా, రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపును సంపాదించుకున్నామని కొండా సురేఖ అంటున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ ఈస్ట్, పర్కాల్, భూపాలపల్లి, నర్సంపేట, పాలకుర్తి నియోజకవర్గాలే కాకుండా, జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎందరో ఉన్నారని కొండా సురేఖ చెబుతున్నారు. ఎప్పుడూ పార్టీ అభివృద్ధి కోసమే మేము మా స్వంత ఖర్చులతో పనిచేశామని... కానీ  తెలంగాణ ప్రదేశ్ పొలిటికల్ ఎ ఫైర్స్ కమిటీలో నా పేరు లేకపోవడం మనస్తాపాన్ని కలిగించిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: