కొత్త శక్తిని సృష్టిస్తున్న పవన్ కల్యాణ్‌..?

Chakravarthi Kalyan
పవన్ కల్యాణ్ కొత్త శక్తిని సృష్టిస్తున్నారు. పవన్‌ కల్యాణ్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర యువత కోసం జనవరి 12వ తేదీన రణస్థలంలో యువ శక్తి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ యువశక్తి కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను శ్రీకాకుళం ఆనందమయి పంక్షన్ హాల్‌లో నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. జనసేన పార్టీ ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారించిదని నాదెండ్ల మనోహర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి చదువుల కోసం వలసలకు వెళ్లాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొందని నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు.
యువత వలసలకు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి కల్పించేలా కృషి చేస్తున్నామని నాదెండ్ల మనోహర్ అన్నారు.  పోలీసుల జాబ్‌ నోటిఫికేషన్ అలస్యంగా విడుదల చేయడం వలస... నష్టపోయిన పరిస్థితి చాలా మంది నిరుద్యోగుల్లో ఉందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రచారం కోసం సిద్ధం చేసిన వారాహి వాహనం కోసం వైసీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో పారదర్శకంగా ఉంటామన్న నాదెండ్ల మనోహర్.. ప్రజా క్షేత్రంలో మేము తప్పనిసరిగా పోరాడుతామని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: