భలే చిత్రం: 586 కేజీల గంజాయి తినేసిన ఎలుకలు?

Chakravarthi Kalyan
గంజాయి దమ్ము భలే మత్తుగా ఉంటుందని మత్తురాయుళ్లు చెబుతారు. చాలా మంది దీనికి బానిసలు అవుతారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల గంజాయి టన్నుల్లో వెలుగు చూస్తోంది. అయితే విచిత్రం ఏంటంటే.. మనుషులే కాదు ఎలుకలు కూడా గంజాయి తింటాయట. వినటానికి చిత్రంగా ఉన్నా ఇది నిజమేనట.. ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఈ మాట చెబుతున్నారు. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయట.
యూపీలోని  మథుర పోలీసులు స్వయంగా ఈ విషయాన్ని కోర్టుకు తెలిపారు. అంతే కాదు.. ఈ వాదనతో నార్కోటిక్ డ్రగ్స్ కోర్టుకు యూపీ పోలీసులు ఓ నివేదిక సమర్పించారు. వేర్వేరు దాడుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 586 కేజీల గంజాయిని సరెండర్ చేయాలని కోర్టు వారిని  ఆదేశించింది. దీంతో షేర్ ఘర్ , హైవే పోలీస్ స్టేషన్ లో దాచిపెట్టిన గంజాయిని ఎలుకలు తిన్నాయని పోలీసులు చెబుతున్నారు. చిన్నసైజులో ఉండే ఎలుకలు పోలీసులకు భయపడడం లేదట. ఈ  సమస్యను పరిష్కరించడానికి మేమేం నిపుణులం కాదని పోలీసులు వాదిస్తున్నారు. మరి ఎలుకలే తినేశాయా.. లేక ఖాకీలే పక్కదారి పట్టించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: