చంద్రబాబు కొత్త ప్లాన్‌.. వర్కవుట్ అవుద్దా?

Chakravarthi Kalyan
ఏపీలో ఎన్నికల వేడి అప్పుడే కనిపిస్తోంది. రాష్ట్రానికి ఇదేమి కర్మ నినాదంతో... ప్రజల్లోకి సరికొత్త కార్యక్రమాన్ని తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రజా సమస్యలను రాత పూర్వకంగా తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఈ సమస్యల పత్రాలను భారీ వాహనంలో ముఖ్యమంత్రి నివాసానికి పంపేలా తెలుగుదేశం కార్యచరణ రూపొందిస్తోంది. చంద్రబాబు ఇటీవల జరిగిన తెలుగుదేశం విసృత్తస్థాయి భేటీలో... ఈ కార్యక్రమం తీరుతెన్నులను చంద్రబాబు వివరించారు.

చంద్రాబాబు కర్నూలు జిల్లా పర్యటన విజయవంతంకావడంతో... వచ్చే రెండు నెలలో 50కి పైగా నియోజకవర్గాలను చుట్టి రావాలని.. చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతి నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రజల్లో ఉండేలా ఇదేమి కర్మ రాష్ట్రానికి  కార్యక్రమం రూపొందించినట్టు తెలిసింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా... నేతలను సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: