వార్నీ.. విమానాల్లో నల్లడబ్బు తరలించారా?

Chakravarthi Kalyan
మద్యం స్కామ్‌లో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. విమానాల్లో హవాలా డబ్బు తరలించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. ఈ కేసు ద్వారా విమానాల ద్వారా నల్లదనాన్ని హవాలా డబ్బు ఎలా తరలిస్తారో తెలిసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఎవరికైనా ప్రత్యేక విమానాలు ఉంటే విమానాలు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎయిర్ వేస్ కి ఉందన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. అరబిందో వాళ్ళు డబ్బులు బంగారం తరలించారని విచారణ చేస్తున్నారన్నారు. అందుకే ప్రైవేట్ విమానాలు కూడా తనిఖీ చేయాలని.. లేదంటే అక్రమంగా డబ్బు బంగారం బయటకు వెళ్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా స్పందిస్తూ ..  దేశ సంపదను మోదీ సర్కారు బడా పారిశ్రామిక వేత్తలకు ధారాదత్తం చేస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య వేధిస్తోందని.. మోదీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని.. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. కానీ మోడీ మద్దతు ఇస్తున్న కార్పొరేట్ శక్తులు మరింత బలోపేతమయ్యాయన్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా.. పేదలు మరింత పేదలు అవుతున్నారని...  కేంద్రం నేషనల్ విద్యా విధానాన్ని రాష్ట్రాల మీద బలవంతంగా రుద్దుతుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: