షిరిడీ సాయి భక్తులకు శుభవార్త.. ఎంత అదృష్టమో?

Chakravarthi Kalyan
తిరుమల తర్వాత అంతటి రికార్డు స్థాయి హుండీ లెక్కింపులు ఉన్న ఆలయం షిరిడీ. దీపావళి సెలవుల సమయంలో ఈ ఆలయానికి 17 కోట్లకు పైగా కానుకలు వచ్చాయి. ఇప్పుడు చెప్పేది షిరిడీ సాయి భక్తులకు నిజంగా శుభవార్తే.. ఇప్పుడు సాయి సమాధిని తాకే భాగ్యాన్ని సాయి సంస్థాన్‌ సామాన్య భక్తులకు కూడా కల్పిస్తోంది. ఈ విషయాన్ని సాయి సంస్థాన్ ప్రకటించింది. నిత్యం హారతి, భజనలతో రద్దీగా ఉండే ఆలయానికి వచ్చే భక్తులు ఒక్కసారైనా బాబా సమాధిని తాకాలని అనుకుంటారు. ఒకప్పుడు అలా తాకే వారు కూడా. కానీ రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల... షిరిడీ సాయి సంస్థాన్ పలు నిబంధనలు పెట్టింది.

ప్రస్తుతం భక్తులకు, సాయి సమాధికి మధ్య గాజు అద్దం ఉంటోంది. వీఐపీలు మాత్రమే బాబా దగ్గరకు వెళ్లి ఆ సమాధిని తాకే అదృష్టం దక్కించుకుంటున్నారు. సాధారణ భక్తులు మాత్రం దూరం నుంచే దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడు సామాన్యులకు కూడా సాయి సమాధిని తాకే అవకాశాన్ని  సాయి సంస్థాన్ కల్పిస్తోంది. అంతే కాదు. సాయి సచ్చరిత్రను వివిధ భాషల్లో ప్రచురించే ప్రయత్నం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sai

సంబంధిత వార్తలు: