ఆర్టీసీకి తెలంగాణ సర్కారు బంపర్‌ బోనాంజా?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ టీఎస్‌ ఆర్టీసీ పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత ఆర్థికాంశాలు, తాజాగా నెలకొన్న పరిస్థితులు, సంస్థకు వస్తున్న ఆదాయంతోపాటు ఖర్చు అప్పులు తదితర అంశాలపై సమీక్షలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ చర్చించారు. ప్రభుత్వం బడ్జెట్‌లో సంస్థకు 1500 కోట్లు ఇస్తోందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ తెలిపారు. ఇవే కాకుండా అదనంగా మరో 1500కోట్ల రూపాయలు బడ్జెటేతర నిధులుగా కేటాయించిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ వివరించారు.
బడ్జెట్‌లో కేటాయించిన నిధులన్ని ప్రభుత్వం సంస్థకు నెల నెలా సమకూర్చుతోందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్  వివరించారు. ఈ సమావేశంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్, అర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు, అర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌ పాల్గొన్నారు. వీరితో పాటు  సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ యాదగిరి, సంస్థ ఆర్థిక సలహాదారు రమేష్‌ తదితర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: