తెలంగాణలో తిరిగే హక్కు మోదీకి లేదా?

Chakravarthi Kalyan
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదని సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అంటున్నారు. సింగరేణిని ప్రైవేట్‌ పరం చేయాలనుకుంటున్న మోదీకి ఆ హక్కు లేదంటున్నారు. ఈనెల 12న.. తెలంగాణకు వస్తున్న ప్రధానిని అడ్డుకుంటామని కూనంనేని సాంబశివరావు  తెలిపారు. ఎనిమిదేళ్లలో మోదీ తెలంగాణకు చేసిన ఒక్క మంచి పని లేదని కూనంనేని సాంబశివరావు  ధ్వజమెత్తారు.

ఈనెల పదో తేదీన సింగరేణి బొగ్గు గనుల్లో ఆందోళనలు చేయడంతోపాటు.. 12న ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని కూనంనేని సాంబశివరావు  స్పష్టం చేశారు. ప్రధానమంత్రి గో బ్యాక్‌కు.. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు కూడా పిలుపునిచ్చాయి. హైదరాబాద్‌లోని  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమైన కార్మిక సంఘాల ప్రతినిధులు.. సింగరేణి, విద్యుత్‌, ఎన్‌టీపీసీ రంగాల ప్రైవేటీకరణ చర్యలను.... ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయాలని తీర్మానించారు. లేకపోతే ఈనెల 12న.... పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడతామని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: