మునుగోడులో ఎలా గెలిచామో చెప్పిన టీఆర్ఎస్‌ నేతలు?

Chakravarthi Kalyan
మునుగోడులో కమ్యూనిస్టు శ్రేణుల ప్రచారం వల్లనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారని మంత్రి జగదీశ్‌ రెడ్డి అంటున్నారు. టీఆర్‌ఎస్‌ విజయానికి సహకరించిన సీపీఎం, సీపీఐ నేతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్‌ రెడ్డి, పల్లా వెంకట్‌ రెడ్డిను కలిసి జగదీశ్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఐక్యంగా కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించున్నట్లు మంత్రి తెలిపారు.
దేశంలో భాజపాకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణాను పెద్ద విపత్తు నుంచి కాపాడమనే సంతోషం సీపీఐకి ఉందని కూనంనేని సాంబశివరావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో బీజేపీకి ఎండ్‌ కార్డు పడిందని కూనంనేని అన్నారు. కమ్యూనిస్టుల సహకారంతో కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ది చేయాలని తెలిపారు. సీపీఐ, సీపీఎం సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానని ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: