తెలంగాణకు కొత్త కుర్ర కలెక్టర్లు.. ఇదిగో జాబితా?

Chakravarthi Kalyan
2020 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొస్టింగులు ఇచ్చింది.  14 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీలు పోస్టింగుల ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా 2020 బ్యాచ్ కు చెందిన ఏడుగురిని, 2019 బ్యాచ్ కు చెందిన ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌గా అపూర్వ్ చౌహాన్‌, వరంగల్ అదనపు కలెక్టర్‌గా అశ్వినిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మంచిర్యాల అదనపు కలెక్టర్ గా  బి. రాహుల్‌, నారాయణపేట అదనపు కలెక్టర్ గా మయాంక్‌ మిత్తల్ కు పోస్టింగులు ఇచ్చారు.
జగిత్యాలకు మందా మకరందును, జనగామకు  ప్రఫుల్‌ దేశాయిని అదనపు కలెక్టర్లుగా నియమించారు. మేడ్చల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా అభిషేక్ అగత్స్య, నల్గొండ అదనపు కలెక్టర్ గా  కుష్బు గుప్తాకు పొస్టింగ్ ఇచారు. నల్గొండ అదనపు కలెక్టర్ గా ఉన్న రాహుల్ శర్మను వికారాబాద్ కు బదిలీ చేశారు. ఇప్పటి వరకు ఆయా జిల్లాల్లో అదనపు కలెక్టర్లుగా ఉన్న హరిసింగ్, చంద్రారెడ్డి, అరుణశ్రీ, అబ్దుల్ హమీద్, జాన్ శాంసన్ లను తదుపరి పొస్టింగుల కోసం సంబంధిత శాఖల్లో  రిపోర్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం  ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

IAS

సంబంధిత వార్తలు: