ఏపీలో మూడున్నరేళ్లుగా అంతా రివర్స్ గేర్‌?

Chakravarthi Kalyan
రాష్ట్రంలో అభివృద్ధి రివర్స్ గేర్‌లో నడుస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు జగన్మోహన్‌రెడ్డి పేరు మార్చి చేస్తున్నారని ఎంపీ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పు చేయ్యడం... తెలుగు వారి అత్మగౌరవం దెబ్బతీసిదన్నారు. ప్రధానమంత్రి కలిసిన తర్వాత జగన్మోహన్‌రెడ్డి ఎందుకు మీడియా ముందుకు రావడానికి భయపడుతున్నారన్న రామ్మోహన్‌నాయుడు.. మూడున్నర సంవత్సరంలో ఎక్కడైనా ప్రత్యేక హోదా కోసం మాట్లాడారా అని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్ర ప్రజల మధ్య రెచ్చగొట్టడానికి... మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చారని  ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. జగన్మోహన్‌రెడ్డి మూడున్నర ఏళ్ళుగా... రాష్ట్రంలో చీకటి పాలన చేస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ వస్తుందన్న యనమల... జగన్మోహన్‌రెడ్డి పాలనలో పేదరికం పెరుగుతుందన్నారు. బలహీన వర్గాలను బానిసలుగా జగన్మోహన్‌ రెడ్డి తయారు చేస్తున్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: