ప్రకృతి వ్యవసాయానికి టీటీడీ అండ!

Chakravarthi Kalyan
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. అందుకే సాధారణ ధరల కంటే అధికంగా వెచ్చించి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. రైతు సాధికార సంస్ధ, మార్క్ ఫెడ్ తో కలిసి ప్రకృతి వ్యవసాయదారుల ఆత్మీయ సమావేశం తిరుపతి శ్వేత భవనంలో టీటీడీ నిర్వహించింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతులు హాజరయ్యారు. టీటీడీ, మార్క్ ఫెడ్ ఒప్పందాలతో తమకు మెరుగైన ధరలు లభిస్తున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
గతేడాది శనగలు కొనుగోలు చేశారు. ఈ ఏడాది నుంచి  12 రకాల దాన్యాలను కొనుగోలు చేయనున్నట్లు రైతుసాధికార సంస్ధ ముఖ్యకార్యదర్శి విజయ్‍ కుమార్‍ తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారులకు, తితిదేకి మధ్యవర్తిగా మార్క్ ఫెడ్ వ్యవహరిస్తోంది. దీని ద్వారా రైతులకు సకాలంలో డబ్బులు అందుతున్నాయి. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, రైతు సాధికార సంస్ధ ముఖ్యకార్యదర్శి విజయ్‍ కుమార్‍, మార్క్ ఫెడ్ ఎండీ ప్రద్యుమ్న పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd

సంబంధిత వార్తలు: