ఆదిపురుష్ టీజర్ విడుదల: గూస్ బంప్స్ ఖాయం?

Purushottham Vinay
పాన్ ఇండియా సూపర్  స్టార్  ప్రభాస్ ప్రధాన పాత్రలో  బాలీవుడ్  టాలెంటెడ్  దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది భారతీయులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రెబల్  స్టార్  ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలారు. ఇప్పుడు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.


 రాముడి జన్మ స్థానం అయిన అయోధ్య నగరంలో సరయు నదీ తీరంలో టీజర్ ను రిలీజ్ చేయడం విశేషం. 1:40 నిమిషాల ఈ టీజర్ ఎంతో అద్భుతంగా ఉంది. శ్రీరామునిగా ప్రభాస్ కనిపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. టీజర్ లో కనిపించిన షాట్స్ చూస్తుంటే ఇదొక విజువల్ వండర్ లా నిలవబోతుందనిపిస్తుంది. రామసేతుపై శ్రీరాముని గెటప్ లో ప్రభాస్ నడిచొచ్చే తీరు ఇంకా అలాగే లంకేశ్ గా సైఫ్ అలీఖాన్ రాక్షస గెటప్ హైలైట్ గా నిలిచాయి. సీత, లక్ష్మణుడు, హనుమంతుడు క్యారెక్టర్స్ ను కూడా చూపించారు.జై శ్రీ రామ్  అనే నేపధ్య సంగీతం కూడా మరో హైలైట్ గా నిలిచి గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: