బిగ్ షాక్.. వాళ్లకు జగనన్నఇళ్లు రద్దు?

Chakravarthi Kalyan
జగనన్న కాలనీల్లో ప్లాట్లు పొందిన లబ్దిదారులు ఇళ్లు నిర్మించుకోకుంటే రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ఇటీవల తెనాలి మండలం కొలకలూరులోని జగనన్న కాలనీలో పర్యటించిన కలెక్టర్.. అక్కడ కొందరు లబ్దిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోవటంపై ఆరా తీశారు. ఇళ్లు లేని వారి కోసం ఏ ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ చేయలేదన్నారు. ఇంటి స్థలంతో పాటు రాయితీపై నిర్మాణ సామాగ్రి ఇస్తోంటే కట్టుకోవటానికి ఇబ్బందేంటని కలెక్టర్ వేణుగోపాల రెడ్డి ప్రశ్నించారు.
సాకులు చెబుతూ ఇళ్లు నిర్మించుకోవటం లేదని కలెక్టర్ వేణుగోపాల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వారికి పట్టా రద్దు చేయాలని తహసీల్దార్ ను కలెక్టర్ వేణుగోపాల రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు వెనక్కు తీసుకోవటం లేదని అసెంబ్లీలో చెబుతుంటే.. కలెక్టర్ వేణుగోపాల రెడ్డి మాత్రం ఇలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: