దుబాయ్‌లో వెంకన్నఆలయం.. నేటి నుంచే దర్శనాలు?

Chakravarthi Kalyan
ప్రపంచంలోనే అత్యంత ఆదాయం ఉన్న దేవుళ్లలో మన ఏడుకొండలవాడు ఒకరు. ఇండియాలోనే కాదు.. అనేక దేశాల్లో వెంకన్నకు ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు దుబాయ్‌లోనూ వెంకన్న ఆలయం మొదలైంది. ఇవాళ్టి నుంచి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. ఆదివారం నుంచి దుబాయి నగరంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. దుబాయిలోని జబల్‌ అలీలో కొత్తగా నిర్మించిన దేవాలయ ప్రాంగణంలో తిరుమల వెంకటేశ్వరుని విగ్రహ ప్రతిష్ఠ పూర్త అయ్యింది.
పూర్తి ఆగమ శాస్త్ర ఆచారాలతో అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మించారు.  ఆలయ సముదాయంలో వివిధ దేవతామూర్తులను ప్రతిష్ఠించాకుయ అందులో తెలుగు నాట భక్తుల పాలిట కొంగు బంగారమైన ఏడుకాసుల వెంకటేశ్వర స్వామి ప్రతిమ కూడా ఉంది. ఆదివారం నుంచి  వెబ్‌సైట్‌ ద్వారా ముందస్తుగా నమోదు చేసుకున్న వారిని మాత్రమే స్వామి వారి దర్శనం లభిస్తుంది. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు దర్శించుకోవచ్చు. ప్రస్తుతానికి ధూప దీప నైవేద్యాలు సమర్పించడానికి అవకాశం లేదు. అక్టోబరులో ఈ వెంకన్న ఆలయాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: