ఇండియన్స్ బాగా అప్‌డేట్‌ అయ్యారుగా?

Chakravarthi Kalyan
ఇండియాలో ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తోంది. ప్రత్యేకించి డిజిటల్ పేమెంట్స్ బాగా పెరిగిపోతున్నాయి. చివరకు ఐదు రుపాయల కరివేపాకు కట్టకొన్నా.. గూగుల్ పే చేస్తున్నారు తప్ప జేబులో నుంచి డబ్బు తీయడం లేదు. అసలు తీయడానికి జేబులో డబ్బు ఉంచుకోవడం లేదు. ఇండియాలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్- యూపీఐ లావాదేవీలు జోరుగా పెరుగుతున్నాయి. చిన్న మొత్తం నుంచి వేల రూపాయల నగదును సులువుగా చెల్లించుకునే సదుపాయం ఉండటంతో అంతా ఇటే మొగ్గుతున్నారు.

డిజిటల్ లావాదేవీలను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే యూపీఐ లావాదేవీల విలువ 10.73 లక్షల కోట్లుగా  నమోదైందట.  ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్.. ఎన్ పీసీఐ చెప్పింది. జులై నెలలో 10.63 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు నడిచాయి. అంటే ఆగస్టులోనూ ఈ విషయంలో  వృద్ధి నమోదైంది. మొత్తం డిజిటల్ పేమెంట్ లావాదేవీల సంఖ్య ప్రస్తుతం 657 కోట్లకు పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

upi

సంబంధిత వార్తలు: