ఆ యాప్‌ అస్సలు వాడొద్దు..?

Chakravarthi Kalyan
ఏపీలో ఇటీవల జగన్ సర్కారు ఉపాధ్యాయుల హాజరు కోసం ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం టీచర్లు స్కూలుకు రాగానే తమ హాజరును ఈ యాప్‌లో నమోదు చేయాలి. అలాగే వెళ్లిపోయేటప్పుడు కూడా ఈ యాప్ ద్వారా హాజరు నమోదు చేయాలి. అయితే.. ఈ యాప్ వాడకాన్ని టీచర్ల సంఘాలు తప్పుబడుతున్నాయి. ఉపాధ్యాయుల హాజరు విధానంపై ఈ మేరకు ఫ్యాప్టో సంఘం కీలక ప్రకటన చేసింది. ఫేషియల్ యాప్ ను సెప్టెంబర్ ఒకటి వరకు డౌన్లోడ్ చేసుకోవద్దని ఉపాధ్యాయులకు సూచించింది.

ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నా, ఫేషియల్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు ఎవ్వరు హాజరు వేయవద్దని ఫ్యాప్టో సూచించింది. ఒకవేళ సెప్టెంబర్ ఒకటి నాటికి ఫేషియల్ యాప్ మీద  ప్రభుత్వ వైఖరిలో మార్పు లేకపోతే 2 తేదీ నుంచి అన్ని రకాల యాప్‌లను బందు చేయాలని పిలుపు ఇవ్వాలని కూడా ఫ్యాప్టో కార్యవర్గ సమావేశం నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: