ఎన్ని టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా కలుస్తుందో?

Chakravarthi Kalyan
నీరు.. జీవకోటికి ప్రాణాధారం.. అందుకే నీరు అందుబాటులో ఉన్నచోటే నాగరికతలు వెలిశాయి. ఆధునిక కాలంలోనూ నీరు అందుబాటులో ఉన్నచోటే అభివృద్ధి జరిగింది. కానీ.. నీటి ప్రాధాన్యత అంతగా తెలిసినా.. ఇంకా మనం నీటిని ఒడిసి పట్టుకోలేకపోతున్నాం. గోదావరి, కృష్ణా నదుల నుంటి ఇంకా సముద్రంలో వేల టీఎంసీల నీరు వృథాగా పోతోంది. ఈ ఒక్క ఏడాదే గోదావరి నుంచి 3,500 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా వెళ్లినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

అలాగే కృష్ణా కూడా కొన్నేళ్లుగా ఉద్ధృతంగానే ప్రవహిస్తోంది. కృష్ణా నది నుంచి ఇప్పటి వరకూ 220 టీఎంసీల నీరు సముద్రానికి వెళ్లనట్టు లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం సాగర్‌ జలాశయంలో గరిష్ఠ స్థాయిలో నీరు నిల్వ ఉంది. దిగువన పులిచింతలలో నిల్వ చేసే పరిస్థితి లేదు. అందుకే ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని సముద్రానికి వదులుతున్నారు. అటు గోదావరి పరిస్థితి అంతే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: