గోరంట్ల మాధవ్‌ : ఆ మహిళను ఉంచారో.. చంపేశారో?

Chakravarthi Kalyan
గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఇష్యూపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. న్యూడ్ వీడియో విషయంలో ఎంపీ మాధవ్ పై ఫిర్యాదు లేదు కదా..? బాధేంటీ అని సజ్జల అనటం దుర్మార్గమని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ మండిపడుతున్నారు. అసలు ఆ మహిళను వైసీపీ నేతలు ప్రాణాలతో ఉంచారో.. చంపేశారో ఎవరికి తెలుసని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు. ఎంపీ మాధవ్ ను వెనకేసుకొచ్చి.. రక్షించే ప్రయత్నం మానుకోవాలన్న కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ.. గోరంట్ల మాధవ్‌ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్నారు.

ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో విషయంలో డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వస్తే.. అందుబాటులో ఎవ్వరూ లేరని.. సీపీఐ నాయకురాలు దుర్గా భవానీ అన్నారు. పబ్లిక్ హాలిడే కాబట్టి.. పోలీసు ఉన్నతాధికారులు సెలవులో ఉన్నారని.. 24 గంటలు పని చేయాల్సిన పోలీసు శాఖ సెలవు తీసుకుందని..  జనసేన మహిళా నేత రావి సౌజన్య అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: