వైసీపీ అంటే.. యువజన శృంగార రసిక చిలిపి పార్టీ?

Chakravarthi Kalyan
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్ వీడియో వైసీపీని దారుణంగా ఇబ్బంది పెడుతోంది. ఈ అంశంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దొరికిందే అవకాశం అన్నట్టు విమర్శలతో రెచ్చిపోతున్నాయి. వైసీపీ పేరును ‘యువజన శృంగార రసిక చిలిపి పార్టీ’గా ఎంపీ గోరంట్ల మాధవ్‌ సార్థకం చేశారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వెటకారం చేస్తున్నారు. గతంలో ‘అవంతి అరగంట సరసం, మొన్న అంబటి గంట విహారం ఆడియోలు బయట కొస్తే వారిపై జగన్‌రెడ్డి ఏం చర్యలు తీసుకోలేదని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గుర్తు చేశారు.

అంతే కాదు..  ఇలాంటివి చేస్తేనే అధినేత గుర్తిస్తున్నారని ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియోను బయటకు వదిలారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్‌కు పదవిచ్చినా ఆశ్చర్యం లేదని మరో టీడీపీ నేత బీటెక్‌ రవి ఎద్దేవా చేశారు. గోరంట్ల మాధవ్‌ లీలలు మెచ్చి జగన్‌ కేంద్ర మంత్రి పదవిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు బీటెక్ రవి. మహిళలపై దాడి చేస్తే పదోన్నతిస్తున్న జగన్‌రెడ్డి తీరు రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు పెరగడానికి కారణమవుతోందంటున్నారాయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: