జగన్‌.. ఆ ఉద్యోగాలు పీకేయబోతున్నాడా?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్‌లో జీవో 117 ప్రకంపనలు సృష్టిస్తోంది. పాఠశాలల  హేతుబద్దీకరణ కోసం ఈ జీవో తెచ్చారు. అయితే.. ఈ రేష‌న‌లైజేష‌న్ విధానం వల్ల మొత్తం 55 వేలకి పైగా ఉపాధ్యాయ పోస్టులు రద్దు కావ‌డం ఖాయం అంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు.. ఈ జీవో విద్యావ్యవ‌స్థకే మ‌ర‌ణ‌శాస‌నం రాయ‌డమే అని విమర్శిస్తున్నారు.
ఈ జీవోను అమలు చేస్తే..  మ‌రో ప‌దేళ్ల పాటు డిఎస్సీ కూడా వేసే ప‌రిస్థితి ఉండదంటున్నారు. ఇలాగైతే టీచ‌ర్ కావాల‌ని క‌ల‌లు కంటున్న ల‌క్షలాది మంది ఆశ‌లు ఆవిరి కావడమే అంటున్నారు. త‌ల్లిదండ్రులు కూలినాలికి వెళితే, పాఠ‌శాల‌ల‌కు వాగులు, వంక‌లు దాటి పిల్లలు ఎలా వెళ్లగ‌ల‌రని ఉపాధ్యాయులు ప్రశ్నించారు. పాఠ‌శాల‌లు తెరిచిన రోజునే రాష్ట్రవ్యాప్తంగా త‌మ బ‌డులు త‌ర‌లించొద్దంటూ పిల్లలు, త‌ల్లిదండ్రులు రోడ్లు ఎక్కుతున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అయితే.. విద్యార్థుల భవిష్యత్‌ కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తాము ఉద్యోగాలు తగ్గించే ప్రసక్తే లేదంటున్నారు వైసీపీ నాయకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: