ఎక్కడైనా రెడీ.. చంద్రబాబుకు జోగి రమేశ్‌ సవాల్‌?

Chakravarthi Kalyan
మాజీ మంత్రి జోగి రమేశ్ చంద్రబాబుకు సవాల్ విసిరారు. సామాజిక న్యాయం అంశంపై చర్చకు సిద్ధమని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ఆయనతో చర్చకు తాను సిద్ధం అని మాజీ మంత్రి జోగి రమేశ్ సవాల్ విసిరారు. ఈ నెల 29న గుడివాడలో చంద్రబాబు నిర్వహించనున్న బహిరంగ సభపైనా మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజిక న్యాయంపై చర్చకు సిద్ధమన్న చంద్రబాబుతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

చంద్రబాబు ఆహ్వానిస్తే గుడివాడ బహిరంగ సభపైనే చర్చించేందుకు సిద్ధమని జోగి రమేశ్ అన్నారు. గుడివాడ సభ కాకపోతే చంద్రబాబు బస చేసే నిమ్మకూరు వచ్చైనా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నారు. అసలు చంద్రబాబు నిమ్మకూరు ఏ ముఖం పెట్టుకుని వస్తారని జోగి రమేశ్ ప్రశ్నించారు. మచిలీపట్నంలో జరిగిన అమ్మ ఒడి జిల్లా స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జోగి రమేష్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: