ఆత్మకూరు పోలింగ్ ప్రారంభం.. వైసీపీకి గెలుపు ఖాయం?
ఆత్మకూరు ఉపఎన్నిక కోసం 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 131 సమస్యాత్మక, 148 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉపఎన్నికకు సంబంధించి కలెక్టరేట్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఆత్మకూరు ఉపఎన్నిక సందర్భంగా కొవిడ్ ప్రొటోకాల్ అమలులో ఉంటుంది.
మహిళ కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 78 పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 1,409 పోలింగ్ సిబ్బంది, 1100 మంది పోలీసులు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటాయి.