వైసీపీ మంత్రుల బస్సు యాత్ర వెనుక అసలు సీక్రెట్ ఇదా?

Chakravarthi Kalyan
ఇటీవల వైసీపీ మంత్రులు సామాజిక న్యాయ భేటీ అంటూ బస్సు యాత్ర చేశారు.. అటు శ్రీకాకుళం నుంచి ప్రారంభించి.. అనంతపురం జిల్లా వరకూ బస్సు యాత్ర చేసారు. అక్కడక్కడా సభలు నిర్వహించారు. మొత్తానికి బస్సు యాత్ర ముగిసింది. అయితే.. ఈ బస్సు యాత్ర వెనుక అసలు రహస్యం ఒకటి ఉందంటున్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు.

ఈ యాత్రకు ముందు నిర్వహించిన గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో వ్యతిరేకత రావడంతోనే బస్సు యాత్ర ప్రారంభించారని అచ్చెన్నాయుడు సూత్రీకరించారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై ప్రజల్లో విపరీతంగా వ్యతిరేకత  వచ్చిందట. అందుకే వైసీపీ మంత్రులు బస్సు యాత్ర చేపట్టారట. బస్సు యాత్ర అయితే నిలదీసేందుకు అవకాశం పెద్దగా ఉండదని.. ఈ ప్లాన్ వేశారంటున్నారు అచ్చెన్నాయుడు. అయితే.. బస్సు యాత్ర అయినా నిలదీసేవారికి ఉన్న అడ్డంకి ఏంటో మాత్రం అచ్చెన్న చెప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: